సత్యవేడు ప్రాంతంలో ప్రస్తుతం 552 హెక్టార్లలో జీడిమామిడి తోటలు ఉన్నాయి. అటవీ ప్రాంతం అభివృద్ధిలో ఎక్కడా నిర్లక్ష్యం లేదు. అనుకూల పరిస్థితులను బట్టి తోటల పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్నాం. యూకలిప్టస్, క్లోన్స్ రకం తైలం చెట్లను ఈ ప్రాంతంలో నాటడంతో ఆరేళ్లకు ఓసారి కట్టింగ్ చేస్తున్నారు. వాటిని తమిళనాడులోని ఒక పరిశ్రమ, శ్రీకాళహస్తి సమీపంలోని మరో పరిశ్రమకు సరఫరా చేస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో గ్రీనరీ, స్థానికులకు ఉపాధి, ఆదాయం పరంగా రాబడిని సంస్థకు చేకూరుస్తూ ఎక్కడా ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నాం. – బ్రహ్మయ్య, డివిజనల్ మేనేజర్,
ఏపీఎఫ్‌డీసీ, సత్యవేడు డివిజన్


