వెంకటగిరి రూరల్ : మండలంలోని 9వ బెటాలియన్‌ను బుధవారం కర్నూల్ రేంజ్–11 డీఐజీ డి.ఉదయభాస్కర్ తనిఖీ చేశారు. ఆయనకు కమాండెంట్ ఈఎస్ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆయన ప్రధాన కార్యాలయం, భెల్ ఆఫ్‌వర్క్, ఎంట్రీ గ్రూపులను పరిశీలించారు. బీడబ్ల్యూవో స్పోర్ట్స్, యూనిట్ క్యాంటీన్, యూనిట్ వైద్యశాల, కంపెనీ కార్యాలయాలను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, యూనిట్ సమగ్ర పనితీరుపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎన్‌హెచ్ విజయ్ ఆనంద్, ఖన్నా, రామకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సులోచన పాల్గొన్నారు.
గౌరవ వందనం స్వీకరిస్తున్న
డీఐజీ ఉదయ భాస్కర్


