స్పోర్ట్స్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

● ఏడు కాంస్య పతకాలు కై వసం

తిరుపతి అర్బన్‌: రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్‌ మీట్‌లో జిల్లా సమగ్రశిక్ష–సహిత విద్య విభాగానికి చెందిన సీడబ్ల్యూఎస్‌ఎన్‌ విద్యార్థులు సత్తాచాటారని ఐఈ కో ఆర్టినేటర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా అగిరిపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా స్పార్ట్స్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఏడు కాంస్య పతకాలను దక్కించుకున్నారని వెల్లడించారు. జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్‌ పోటీలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి అర్బన్‌ మండలం ఎస్‌ఎన్‌పురం జెడ్‌పీ హైస్కూల్‌కి చెందిన కే.ముని మూడు విభాగాల్లో ప్రతిభ చూపి మూడు కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. అలాగే శ్రీకాళహస్తి మండలం ఆర్‌పీబీఎస్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చెందిన పి.చరణ్‌ కాంస్య పతకం, తిరుపతి అర్బన్‌ మండలం ఎంజీఎం స్కూల్‌ హిమబిందు, జ్ఞానేష్‌ ఉత్తమ ప్రతిభ చూపారని చెప్పారు. చంద్రగిరి మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నందకిషోర్‌ 400 మీటర్ల రన్నింగ్‌లో ఉత్తమ ప్రతిభ చూపాలని వివరించారు. ఐఈఆర్‌పీలు వెంకటరమణ, జ్ఞానమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement