తిరుపతి అర్బన్:సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల పెత్తనం ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ డాక్యుమెంటేషన్ రైటర్లు ఆందోళన బాట పట్టారు. డాక్యుమెంటేషన్ రైటర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. తమ దుకాణాలకు తాళం వేసి ్ద నిరసన చేపట్టారు. దీంతో డాక్యుమెంటేషన్ సిద్ధం చేసి ఇచ్చేవాళ్లు లేక రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోయాయి.
పడిపోయాయి
జిల్లాలో 18 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. తిరుమల సబ్‌రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కేవలం మ్యారేట్ సర్టిఫికెట్స్ మాత్రమే జారీచేస్తారు. ఆస్తుల క్రయవిక్రయాలు చేపట్టరు. మిగిలిన 17 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మొత్తంగా రోజుకు 2 వేల రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. అయితే డాక్యుమెంట్స్‌ను సిద్ధం చేయడానికి రైటర్లు లేకపోవడంతో క్రయవిక్రయదారులు సొంతంగా డాక్యుమెంట్స్‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 60 రిజిస్ట్రేషన్లు మాత్రమే నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.


