ఒంటరి కుటుంబాలను టార్గెట్ చేస్తూ... ఎవరూ లేరని తెలిసినా, వృద్ధులు ఉన్నారని తెలిసినా వారి ఆస్తులను కబ్జా చేస్తున్నారు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో భూ ఆక్రమణలు, మట్టి, గ్రావెల్‌తో వ్యాపారాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ గుండాల వలే దౌర్జన్యం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు వారికి కొమ్ముకాస్తున్నారు. అవిలాలలో వృద్ధులకు చెందిన 3.17 ఎకరాల భూమిని కబ్జా చేశారు. పోరంబోకు భూమిలో ఆర్చి కట్టారు. ధర్నాలు చేసినా తొలగించడం లేదు. తిరుపతి శివజ్యోతి నగర్‌లో విలేకరుల పేర్లు చెప్పి మూడు ఎకరాలు కబ్జా చేశారు. అరాచకాలు, అన్యాయాలు తార స్థాయికి చేరుకున్నాయి.
– మల్లం రవిచంద్రారెడ్డి, తిరుపతి నగరం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
అధికార పార్టీ నేతల అండతోనే
అధికార పార్టీ నేతల అండతో జిల్లాలో భూఆక్రమణలు సాగుతున్నాయి. తిరుపతి రూరల్ అవిలాలలో వనజాక్షికి చెందిన భూమిని అధికార పార్టీ నేతలు ఆక్రమించి, 22ఏలో పెట్టి. మళ్లీ 22ఏ నుంచి తొలగించి, ఒకరికి రిజిస్ట్రేషన్ చేసి.. ,వెంటనే మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం విడ్డురంగా ఉంది. న్యాయంగా పీజీఆర్‌ఎస్ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుంటే పోలీసులు డ్రోన్లుతో మా ఫొటోలు తీయడం ఏంటి..?. అక్రమంగా కేసులు పెట్టాలని చూస్తే ఊరుకోం. మంగళంలో రూ.7 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమించారు.
–మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి


