సత్యవేడు: మదనంబేడులో రెండు మేకల చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ఎస్‌ఐ సాయినాథ్‌చౌదరి తెలిపారు. మందనంబేడుకు చెందిన రైతు మునస్వామికి చెందిన మేక, మేకపోతు ఇంటి వద్ద కట్టి ఉండగా 18వ తేదీ రాత్రి చోరీ చేసినట్టు సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు దాసుకుప్పం సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఈ కేసులో హనుమంతామపురానికి చెందిన రాజేష్(22), దాసుకుప్పానికి చెందిన మునివేలు(20)ను అరెస్ట్ చేసి నట్టు పోలీసులు తెలిపారు. మునివేలుపై సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో2, నాగలాపురంలో 3 కేసులున్నట్టు తెలిపారు. ఇరువురినీ గంజాయి పరీక్ష చేయగా.. పాజిటీవ్ వచ్చిందన్నారు. ఒక్క రోజులోనే ఎస్‌ఐ లావణ్య, హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు, హనుమంతు, ప్రతాప్, పద్మనాభరెడ్డి కలసి కేసును ఛేదించినట్టు వెల్లడించారు. వీరికి డీఎప్పీ రవికుమార్, సీఐ మురళీనాయుడు రూ.1000 క్యాష్ అవార్డు అందించనున్నారు.


