జిల్లాలో జరుగుతున్న భూ కబ్జాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజంపై ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకుపోతాం. అన్యాయం జరిగిన వారి పక్షనా పోరాటాలు చేస్తూంటే....పోలీసులు డ్రోన్లు, కెమెరాలతో మా ఫొటోలు తీస్తున్నారు. గూండాలు, రౌడీల ఫొటోలు తీయండిజ దైర్యం ఉంటే వారిని లోపల పెట్టండి. తిరుపతిలో ఓ వృద్ధుడిని ఇంటిలో నుంచి గెంటేశారు. వేణుగోపాల్ నగల్‌లో దౌర్జ్యనాలు, వనజాక్షి భూమి కబ్జా, గాంధీపురం ఆక్రమణలు అధికారులకు కనిపించడం లేదా..? –వందాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి
ఆక్రమణలు సరికాదు
ప్రభుత్వాలు వస్తుంటాయి...పోతుంటాయి. అయితే ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములు ఇష్టారాజ్యంగా ఆక్రమించడం సమంజసం కాదు. అధికారం ఉందని కక్ష పూరితంగా వ్యవహరించడంతో మళ్లీ మరో పార్టీ అధికారంలోకి వస్తే ఇదే సంస్కృతిని పాటిస్తే పేద, సామాన్య ప్రజల మనగుడ ప్రశ్నార్థకంగా మారుంది.
– గోపాల్‌రెడ్డి,
కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు
న్యాయం చేయండి సార్
తిరుపతి రూరల్, అవిలాల పరిధిలో సర్వే నం.476–1లోని 3.17 ఎకరాల భూమిని ఆక్రమించారు. నా వయస్సు 75 ఏళ్లు. ఈ వయస్సులో నా భూమిని కాపాడుకోవడానికి రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. ముందే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. దొంగపత్రాలు సృష్టించి మా భూమిని ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లోకయుక్తకు కూడా ఫిర్యాదు చేశాం.
– వనజ, భూ బాధితురాలు, తిరుపతి రూరల్


