తిరుపతి అర్బన్: ముగ్గురు ట్రాన్స్‌జెండర్లకు సోమవారం తిరుపతి కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా కలెక్టర్ ఎస్.వెంటేశ్వర్ ఆధ్వర్యంలో ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్స్, వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారి వినోద్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
లైంగిక దాడి యత్నంలో
ఇద్దరికి జైలు
చిత్తూరు అర్బన్: ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక ఆడికి యత్నించిన కేసులో అనుకుట్టి వెంకటేష్, శశికుమార్ అలియార్ కుమార్ రాజా అనే ఇద్దరు ముద్దాయిలకు 42 నెలల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని 6వ అదనపు జిల్లా కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి హరిత తన తీర్పును వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీ కథనం మేరకు.. 2017 మే 27వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరుపతి నగరంలోని రుయా ఆసుపత్రి వద్ద ఓ మహిళ తన గమ్యం వెళ్లడానికి ఆటో ఎక్కారు. ఆటో నడిపే శశికుమార్ అలియాస్ కుమార్ రాజ, అతని స్నేహితుడు వెంకటేష్ ఆటోలోనే ఉన్నారు. మహిళను ఇస్కాన్ ఆలయ సమీపంలోకి తీసుకెళ్లాక ఆమైపె లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించారు. నిందితుల నుంచి తప్పించుకున్న మహిళ.. తన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. ఆపై బాధితురాలి తల్లి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు మూడున్నరేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.


