18 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

18 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం

Jul 19 2026 2:20 AM | Updated on Jul 19 2026 2:20 AM

– తమిళ స్మగ్లర్‌ అరెస్టు

భాకరాపేట: భాకరాపేట అటవీశాఖ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో శనివారం 18 ఎరచ్రందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకొని స్మగ్లర్‌ను అరెస్టు చేసినట్లు భాకరాపేట రేంజ్‌ అటవీ క్షేత్రాధికారి ఎన్‌. వెంకటరమణ తెలిపారు. చిన్నగొట్టిగల్లు మీదుగా తమిళనాడుకు కారులో ఎరచ్రందనం అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతి జిల్లా అటవీశాఖాధికారి వి.సాయిబాబా ఆదేశాలతో భాకరాపేట రేంజ్‌ అధికారులు, బేస్‌ క్యాంపు సిబ్బంది, ప్రొటెక్షన్‌ వాచర్లు కలిసి శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రత్యేక నిఘా ఉంచి, వాహనాలను తనిఖీ చేశారు. కోటబైలు క్రాస్‌ వద్ద శనివారం తెల్లవారుజామున చిన్నగొట్టిగల్లు వైపు నుంచి అతి వేగంగా వచ్చిన కారును ఆపేందుకు ప్రయత్నించారు. కారు ఆపిన వెంటనే డ్రైవర్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది చుట్టుముట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 18 ఎరచ్రందనం దుంగలు గుర్తించారు. వాటితో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కారు, ఎరచ్రందనం దుంగల విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ దాడిలో అటవీ బీట్‌ అధికారులు ఎం.సదాశివయ్య, జేబీ నిఖిల్‌, వై.రాజేష్‌కుమార్‌, సి.రవి, ప్రొటెక్షన్‌ వాచర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement