సిద్ధార్థలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సిద్ధార్థలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్‌ ప్రారంభం

Jul 18 2026 9:39 AM | Updated on Jul 18 2026 9:39 AM

నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్‌ను శుక్రవారం తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లారుతూ ఐడియా ల్యాబ్‌లో సీఎస్‌సీ మెషన్‌కటింగ్‌, త్రీడి ప్రింటింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ల్యాబ్‌, ఐఓటీ ల్యాబ్‌లతో విద్యార్థులు తమ నైపుణ్యతను పెంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేటివ్‌ టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. యువ ఇంజినీర్లు స్టార్టప్‌లను, ఇంకుబేషన్‌ కార్యక్రమాలలో పాల్గొని మంచి ఎంటర్‌ప్రెన్యువర్లుగా ఎదగాలన్నారు. ఐడియా ల్యాబ్‌ కో–ఆర్డినేటర్‌ రత్నకమల మాట్లాడుతూ సాంకేతిక పరమైన ఐడియాల ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఇన్నోవేషన్‌, ఇంప్లిమెంటేషన్‌, స్టార్టప్స్‌ అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవచ్చని తెలిపారు. కళాశాల చైర్మన్‌ అశోకరాజు మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు అధునాతన సాంకేతిక విజ్ఞనానికి ఐడియాను, టెక్నాలజీని జోడించి అభివృద్ధి పరచడానికి ఐడియా ల్యాబ్‌ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ప్రిన్సిపాళ్లు రమేష్‌కుముద్‌, జనార్దనరాజు, కో–ఆర్డినేటర్‌ సునీల్‌కుమార్‌రెడ్డి, హెచ్‌వోడీలు. అధ్యాపకులు ల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement