చంద్రగిరి: తిరుచానూరులోని శ్రీపద్మావతి, శ్రీనివాసమంగాపుంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామి, అమ్మవార్లతో కలిసి ఆదివారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామివారి జన్మనక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం శ్రీరుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకష్ణ స్వామి బంగారు తిరుచ్చిపై ఆశీనులై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.


