వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఈ విషయంలో అధికారులకు చిత్తశుద్ధి లేదు. ఇకనైనా న్యాయబద్ధంగా మాకు రావాల్సిన వేతనాలు విడుదల చేయాలి. – ఉషారాణి,
ఎంపీటీసీ సభ్యులు, వరదయ్యపాళెం మండలం
తక్షణమే చెల్లించాలి
ఎంపీటీసీ సభ్యుల వేతనం తక్షణమే చెల్లించాలి. అలవెన్సులు కూడా ఇవ్వడం లేదు. గతంలో మాకు ఇస్తున్న నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రస్తుతం అది కూడా లేదు. కేవలం సర్వసభ్య సమావేశాలకే మమ్మల్ని పరిమితం చేశారు.
– శ్యామలమ్మ, వైస్ ఎంపీపీ, వరదయ్యపాళెం మండలం
ఇంత అలుసా
ప్రజాప్రతినిధులంటే కూటమి ప్రభుత్వానికి ఇంత అలుసా. ఎంపీటీసీ సభ్యులందరూ ఆర్థిక స్థోమత కలిగిన వాళ్లనే ప్రభుత్వం పరిగణిస్తోంది. 35 నెలలకు పైగా వేతనాలు ఇవ్వకపోతే సభలు, సమావేశాలకు ఎలా రావాలి. ఇప్పటికై నా వేతనాల విషయంలో స్పందించాలి.
– జాయిస్థానియలు, వైస్ ఎంపీపీ, నాగలాపురం మండలం


