మట్టినీ బొక్కెస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

మట్టినీ బొక్కెస్తున్నారు!

Mar 13 2026 7:33 AM | Updated on Mar 13 2026 7:33 AM

● సత్యవేడు కేంద్రంగా చెలరేగిపోతున్న గ్రావెల్‌ మాఫియా

రోజుకు 2వేల టిప్పర్లకు పైగా తమిళనాడుకు తరలింపు

కొన్నాళ్లకు సత్యవేడులో సహజ సంపద

మటుమాయం

బయోమెట్రిక్‌ నవీకరణపై ప్రత్యేకశ్రద్ధ

తిరుపతి అర్బన్‌: నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్‌ కేంద్రాల్లో విద్యార్థుల బయోమెట్రిక్‌ నవీకరణ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్వర్ణ గ్రామ, వార్డు జిల్లా అధికారి జీవీ నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన తిరుపతి నగరంలోని ఎల్బీనగర్‌లోని స్వర్ణ వార్డులో ఆధార్‌ శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 71,238 మంది విద్యార్థులకు ఆధార్‌ బయోమెట్రిక్‌తోపాటు నవీకరణ చేయాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో జేఈఈ, నీట్‌ పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సైతం ఆధార్‌ నవీకరణ ప్రాధాన్యత ఉందన్నారు. వందశాతం విద్యార్థులకు నవీకరణ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు, అలాగే ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు స్వర్ణ గ్రామం, వార్డుల్లో ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. వీఆర్వో చెంగల్‌రాయలు ఉన్నారు.

రోజువారీ రూ.20 లక్షలకు పైగా మామూళ్లు

నియోజకవర్గంలో గ్రావెల్‌ దోపిడీ అధికార పార్టీ కీలక నేతల కనుసన్నల్లో కొనసాగుతోంది. రోజువారీ ఎంత ఎక్కువ సంఖ్యలో టిప్పర్లు సరిహద్దులు దాటితే అంత ఎక్కువగా అధికార పార్టీ నేతలకు కమీషన్లు అందుతాయి. ఆ దిశగా ప్రస్తుతం 2వేల టిప్పర్లకు సంబంధించి రూ.20 లక్షల మేరకు రోజువారీ కమీషన్లు అందుకుంటున్నట్లు సమాచారం. ఆ మొత్తాన్ని అధికార పార్టీ నేతలు తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా వాటాలు పంచుకు తింటున్నారు.

అక్రమం ఇష్టారాజ్యంగా మారింది..సత్యవేడు నియోజకవర్గం తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమార్కులకు గ్రావెల్‌ తరలింపు సులువుగా మారింది. నేడు ఎర్రచందనం అక్రమ రవాణా కంటే గ్రావెల్‌ రవాణానే వరమైంది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పచ్చనేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.

వరదయ్యపాళెం:ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని సత్యవేడు నియోజకవర్గం లోని పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో గ్రావెల్‌ దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. రోజుకు 2వేల టిప్పర్లకు పైగా సరిహద్దులోని తమిళనాడుకు దర్జాగా తరలిస్తున్నప్పటికీ నియంత్రించాల్సిన అధికారులు తమకేమీపట్టనట్లు వ్యవహరించ డం విమర్శలకు దారి తీస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో 20కి పైగా గ్రావెల్‌ క్వారీల్లో దోపిడీ జరుగుతోంది. పిచ్చాటూరు మండలంలోని పలు గ్రామాల నుంచి గ్రావెల్‌ క్వారీలు అక్రమంగా నిర్వహిస్తున్నాయి. ఈ క్వారీల నుంచి రోజువారీ 2వేల టిప్పర్లకు పైగా గ్రావెల్‌ తమిళనాడుకు తరలిపోతోంది.

వెయ్యి టిప్పర్లకు పైగా తమిళనాడుకు తరలింపు

పిచ్చాటూరు మండలంలో ఐదు గ్రావెల్‌ క్వారీలు ఉండగా ఆ క్వారీల నుంచి వెయ్యికి పైగా టిప్పర్లు రోజూ తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ క్వారీలకు ఆనుకుని ఇటీవల ఎక్స్‌ప్రెస్‌ హైవే బెంగళూరు నుంచి కచ్చూరు కూట్‌రోడ్‌ వరకు విశాలమైన రోడ్డు మార్గం ఏర్పడడంతో గ్రావెల్‌ దోపిడీకి మార్గం సులువైంది.

తమిళనాడులో ఆంధ్ర మట్టికి భలే గిరాకీ

పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఆంధ్ర నుంచి తరలిస్తు న్న గ్రావెల్‌ మట్టికి మంచి డిమాండ్‌ ఉంది. దీంతో ఒక్కొక్క టిప్పర్‌ రూ.30 వేల నుంచి రూ. 50వేల వరకు రేటు పలకడంతో మాఫియా చేస్తున్న అధికార పార్టీకి చెందిన బడా నేతలు రూ.కోట్లు దండుకుంటున్నారు. రోజువారీ తమిళనాడుకు వెళుతున్న 2వేల టిప్పర్ల గ్రావెల్‌ ఖరీదు రూ.6 కోట్లకు పైమాటే. ఇలా రూ.వందల కోట్లు వెనకేసుకునే పనిలో అధికార పార్టీ బడా నేతలు ఉన్నారు.

అధికారపార్టీకి తలొగ్గిన అధికారులు

సత్యవేడు నియోజకవర్గంలో ఇంత దోపిడీ జరుగుతున్నప్పటికీ మైనింగ్‌ శాఖ అధికారులు మొదలు పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పదుల సంఖ్యలో స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెళుతున్నప్పటికీ వారికి అనుమతులు ఉన్నట్లు స్వయాన అధికారులే ప్రకటిస్తుండడంతో గ్రావెల్‌ మాఫియాకు అడ్డూఅదుపు లేని పరిస్థితి. ఈ విషయమై ఇటీవల నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు సైతం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.

సత్యవేడు మండలంలో తెలుగుగంగ కాలువ గట్లను తవ్వేస్తున్న గ్రావెల్‌ మాఫియా

నాగలాపురం మండలంలో గ్రావెల్‌ను టిప్పర్‌కు లోడ్‌ చేస్తున్న జేసీబీ

అనుమతులు గోరంత.. తవ్వకాలు కొండంత

తమిళనాడులో జరుగుతున్న జాతీయ రహదారి పనుల పేరి ట ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు తీసుకోవడం, అది కూడా సరిహద్దు ప్రాంతమైన సత్యవేడు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం స్థానికంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ప్రభుత్వ భూములను ఎంపిక చేసుకుని దోపిడీని కొనసాగిస్తున్నారు. దీనిపై స్థానికులు పలుచోట్ల అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తమకు అనుమతులు ఉన్నాయంటూ బుక్కా యిస్తూ గ్రామస్తులపైనే తిరగబడుతున్నారు. అడ్డొస్తే ఏకంగా తొక్కించుకు పోతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement