శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ ది నాన్ని వేడుకగా జరుపుకున్నారు. ముందుగా శ్రీకాళహస్తి వైఎస్సార్ సర్కిల్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగనన్న కటౌట్‌కి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతో కలసి వేడుకగా జరుపుకున్నారు. పేదలకు అన్నదానం చేశారు. అంజూరు శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్య దర్శి ఉన్నం వాసుదేవనాయుడు పాల్గొన్నారు. ఏర్పేడు సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు నల్లపాళెం శివయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్‌తోపాటు మహిళలకు చీరలు పంపిణీ చేశా రు. రేణిగుంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ నగేశం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు.
ఊరూరా పార్టీ ఆవిర్భావ వేడుకలు
ఇంత దరిద్రపు
ప్రభుత్వం లేదు, రాదు..
తిరుపతి మంగళం : ప్రపంచ రాజకీయ చరిత్రలోనే కూటమి ప్రభుత్వం లాంటి దరిద్రపు ప్రభుత్వం ఇంతవరకు లేదు, ఇకపై రాదు. అధికార దాహంతో నోటికి వచ్చిన అబద్దపు హామీల తో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూటమి సర్కారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ని పక్కన పెట్టి, ప్రజలకిచ్చిన హామీలను తుంగ లో తొక్కాడు చంద్రబాబు. ఎంతసేపు అమరావ తి అభివృద్ధి అంటున్నాడే తప్ప పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీని స్థాపించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పోరాటం సాగిస్తున్న ఏకై క నాయకుడు వైఎస్. జగన్. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే
2029లో వైఎస్సార్ సీపీ
గెలుపు ఖాయం
చంద్రబాబు చెప్పిన అబద్దాలు, చేసిన మోసాలతో ప్రజలంతా విసిగిపోయి, 2029లోవె వైఎస్సార్‌సీపీకి తిరిగి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయం. చంద్రబాబు మోసాలను ఇప్పటికే ప్రజలంతా గ్రహించారని, రాబోయే రోజుల్లో జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పాలన సాగించిన మగాడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన సాగించిన గొప్ప నాయకుడు జగనన్న. తండ్రి ఆశయసాధన కోసం, ప్రజాసంక్షేమం కోసం 2011లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీని స్థాపించారు. అప్పటి నుంచి ఆయన అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు.
– భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ సీపీ
చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు
తిరుపతి అర్బన్:వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలను ఊరూరా ఘనంగా జరుపుకున్నారు. ఆయా ప్రాంతా ల్లోని వైఎస్సార్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తరువాత కేక్‌లు కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. పేదోడి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంటూ నినాదాలు చేశారు. పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గత జగనన్న పాలనను గుర్తు చేసుకున్నారు. జై జగన్..జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. పార్టీ జెండా జెండాలు ఎగురవేశారు.
మహానేత ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ
నగరి: వైఎస్సార్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఇచ్చిన వాగ్దానాలను 99 శాతం నెరవేర్చిన పార్టీ. మాటిస్తే దానిపై నిలబడి పనిచేసిన మహామనిషి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఆ ఘనత దమ్మున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి, ఆయనకు అండగా ఉన్న వైఎస్సార్ కుటుంబ సభ్యులకే చెందుతుంది. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చేయలేని అంశాలు పెట్టి అధికారంలోకి వచ్చాక రెండళ్లవుతున్నా ఏదీ నెరవేర్చలేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతితప్పింది. నగరిలో ప్రకృతి వనరులన్నీ దోచేస్తున్నారన్నారు. దోచుకో ... దాచుకో అన్నదే నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ తీరుగా మారింది. – మాజీ మంత్రి ఆర్కేరోజా


