బుచ్చినాయుడుకండ్రిగ: వాహనాలకు సకాలంలో పన్ను చెల్లించకుండా పట్టుబడితే 200 శాతం జరిమానా విధిస్తున్నట్టు శ్రీకాళహస్తి మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ దామోదర్‌నాయుడు తెలిపారు. ఆయన గురువారం బుచ్చినాయుడుకండ్రిగలోని స్థానిక పోలీసుస్టేషన్ వద్ద వాహనాల రికార్డులను పరిశీలించి, డ్రైవర్ల లైసెన్సులను తనిఖీ చేశారు. తనిఖీ చేస్తుండగా ట్యాక్స్ చెల్లించని మినీబస్సుకు 200 శాతం జరిమానాతో రూ.3,27,900, రెండు లారీలకు రూ. 82,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెల కావడంతో విసృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. వాహనాలకు సకాలంలో పన్ను చెల్లించాలని, తనిఖీలు చేసేటప్పుడు దొరికితే 200 శాతం జరిమానా వేస్తున్నామన్నారు. వాహనాలను నడిపే వారికి తప్పనిసరిగా లైసెన్సు ఉండాలని, రికార్డులు సక్రమంగా లేని వాహనాలను గుర్తించి సీజ్ చేస్తామని తెలిపారు.


