శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని బొక్కిసంపాళెం కేంద్ర మహిళ స్నేహపూర్వక పంచాయతీగా ఎంపిక అయ్యింది. అందులో భాగంగా గురువారం కేంద్రం నుంచి ప్రత్యేక బృందం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీని సందర్శించి మహిళలు చేస్తున్న అభివృద్ధిని పరిశీలించారు. అంగన్‌వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ స్టాళ్లు, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయల స్టాళ్ల ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన అధికారులకు సర్పంచ్ రేఖ శాలువ కప్పి, సన్మానించారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ పంచాయతీని మహిళలు చాలా అభివృద్ధి చేస్తున్నారని, త్వరలోనే పంచాయతీ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కె. సుబ్రహ్మణ్యం, మునిరెడ్డి, మహిళా సంఘాలు, పాల్గొన్నారు.


