వైఎస్సార్‌ సీసీ ఇంటెలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తలమంచి ధనుంజయ రెడ్డి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీసీ ఇంటెలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తలమంచి ధనుంజయ రెడ్డి

Mar 13 2026 7:33 AM | Updated on Mar 13 2026 7:33 AM

● పెనగలూరు మండలానికి రాష్ట్రస్థాయి పదవి

పెనగలూరు: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్‌ ఫోరం ఉపాధ్యక్షుడిగా పెనగలూరు పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన తలమంచి ధనుంజయరెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా ధనుంజయరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయి పదవి వచ్చేందుకు సహకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినందుకు పార్టీ కోసం అహర్నిశలు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement