ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.33.25 లక్షల నష్టం | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.33.25 లక్షల నష్టం

Dec 25 2025 6:17 AM | Updated on Dec 25 2025 6:17 AM

ఆన్‌ల

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.33.25 లక్షల నష్టం

తిరుపతి రూరల్‌: రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆన్‌లైన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ట్రేడింగ్‌ పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం పుదిపట్ల గ్రా మం, శ్రీరామనిలయం, టవర్‌ స్ట్రీట్‌, రామకృష్ణ మిషన్‌ సమీపంలో నివాసం ఉంటున్న బీటెక్‌ పూర్తి చేసిన వ్యక్తి ఒక ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నారు. 42 ఏళ్ల వ్యక్తికి గత నెల 23న ఒక గుర్తు తెలియని వాట్సాప్‌ నంబర్‌ నుంచి లింక్‌ పంపించి, ఆన్‌లైన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. అనంతరం గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించి, ఇన్‌స్టిట్యూషనల్‌ షేర్లు, ప్రీ–ఐపీఓ ట్రేడింగ్‌ పేరుతో వివిధ బ్యాంక్‌ ఖాతాలకు కొంత నగదు బదిలీ చేయించారు. ఆ తరువాత నవంబరు 24వ తేదీ నుంచి డిసెంబర్‌ 17వ తేదీ వరకు వివిద దశల్లో 33.25లక్షలు యాప్‌ ద్వారా బదిలీ చేయించారు. ఆ యాప్‌లో లాభాలు వచ్చినట్లు చూపించి, మొత్తం ఉపసంహరణ కోరిన సమ యంలో లాభంపై 20 శాతం కమిషన్‌, అనంతరం ప్రీ–ఐపీఓ పేరుతో అదనపు భారీ మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో ఫిర్యాదుదారుకు అనుమానం కలిగి, సైబర్‌ క్రైమ్‌ పోలీసు అధికారులను సంప్రదించారు. అది నకిలీ యాప్‌ అని నిర్ధారించుకున్న తరువాత బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్‌ పోలీసులు సంబంధిత బ్యాంక్‌ ఖాతాలు, యాప్‌ లింకులు, ఫోన్‌ నంబర్లు, డిజిటల్‌ ట్రాన్‌ట్రాక్షన్లపై సైబర్‌ నిపుణుల సహాయంతో దర్యాప్తు చేపట్టారు.

రాష ్ట్రస్థాయి యువజనోత్సవాల్లో జిల్లాకు ప్రథమ స్థానం

తిరుపతి కల్చరల్‌: జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యువజనోత్సవ పోటీల్లో జిల్లా కళాకారులు ప్రథమ స్థానం కై వసం చేసుకున్నట్లు సెట్విన్‌ కార్యనిర్వాహణాధికారి డాక్టర్‌ పి.యశ్వంత్‌ తెలిపారు. రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో ఎం.చంద్రశేఖర్‌(జానపద గీతం గ్రూపు), బి.హర్షితారెడ్డి(స్టోరీ రైటింగ్‌) రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు వీరు 2026 జనవరి 12న న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రం తరఫున అర్హత పొందారని తెలిపారు. వీరిని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌తో పాటు సెట్విన్‌ మేనేజర్‌ మోహన్‌కుమార్‌ అభినందించారు.

లారీని ఢీకొన్న కారు

నాయుడుపేటటౌన్‌: మండలంలోని బిరదవాడ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన వారు చైన్నె వైద్యశాలలో ఉన్న వ్యక్తిని తీసుకుని కారులో బయలు దేరారు. కారు బిరదవాడ గ్రామానికి వచ్చే సరికి జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీ ఒక్కసారిగా ఆగడంతో కారు అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరోగ్యం సరిగాలేని వ్యక్తితో పాటు మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వీరు మరో కారులో నెల్లూరుకు తరలి వెళ్లారు. కారు ముందు భాగం దెబ్బతింది. కారు డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎర్రచందనం స్వాధీనం.. ముగ్గురి అరెస్టు

భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట రేంజ్‌ పరిధిలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఎర్రచందనం అక్రమ ర వాణా చేస్తున్న ముగ్గు రు కూలీలను అటవీ అ ధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. దుంగలు, వాహనం విలువను సుమారు రూ.9 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. కొందరు ఎర్రచందనం దొంగలు పరారైనట్లు సమాచారం. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన ముగ్గురు ఎర్రకూలీలు తమిళనాడుకు చెందినవారన్నారు. పట్టుకున్న వారి వివరాలు తంజియప్పన్‌, కార్తి చిన్నసామి, కుమార్‌ అని తెలిపారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.33.25 లక్షల నష్టం 1
1/1

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.33.25 లక్షల నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement