నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి
తిరుపతి సిటీ: విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్షా అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరిగిన జిల్లాస్థాయి కేరీర్ ఎక్స్‌పో కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విద్యార్థులు తాము రూపొందించిన ప్రయోగాలు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు నైపుణ్యాల ప్రదర్శనలను అధికారులు, వీక్షకులను ఆకట్టుకున్నాయి. జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు, అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్‌రావు, స్కిల్ డెవలప్‌మెంట్ రాష్ట్ర పరిశీలకులు చాయేంద్ర, స్కిల్ డెవలప్ మెంట్ జిల్లా అధికారి లోకనాథం, జీసీడీఓ పుష్ప, పాల్గొన్నారు.
నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి


