రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ఆరుగురి ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : కేవీబీపురం మండలం, రాగిగుంట జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో మంగళవారం తిరుపతి జిల్లాస్థాయి మహిళా ఉపాధ్యాయుల త్రోబాల్ పోటీలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో తిరుపతి అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల మహిళా ఉపాధ్యాయుల జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనబరచిన ఆరుగురు ఉపాధ్యాయినులు డి.జ్యోతి (ప్రధానోపాధ్యాయిని, ఎస్పీజేఎన్‌ఎం హైస్కూల్), డి.హేమలత(సంస్కృత ఉపాధ్యాయిని, ఎస్పీజేఎన్‌ఎం హైస్కూల్), డి.నాగవేణి (ఫిజిక్స్ ఉపాధ్యాయిని, ఆర్‌ఎస్ మాడవీధి నగరపాలక హైస్కూల్), బి.మహేశ్వరి (బయాలజీ ఉపాధ్యాయిని, మాలవ్యాజి నగరపాలక హైస్కూల్), పి.సరోజిని (ఎస్‌జీటీ, దొడ్డాపురం నగరపాలక ప్రాథమిక పాఠశాల), వి.సునీత (ఎస్‌జీటీ, పెద్దకాపు వీధి నగరపాలక ప్రాథమిక పాఠశాల) జనవరిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న ఉపాధ్యాయినులను తిరుపతి అర్బన్ ఎంఈఓలు కె.బాలాజీ, బి.భాస్కర్‌నాయక్, అలాగే యూటీఎఫ్ నాయకులు బండి మధుసూదన్‌రెడ్డి, ఎన్.మోహన్, ఎస్.ఖాదర్‌బాషా, ప్రభుకుమార్, ఎస్టీయూ నాయకులు మునికృష్ణనాయుడు, రేణుకాదేవి, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.


