వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత
తిరుపతి క్రైం: తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో వారు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమలలో సుమారు 3వేల మంది పోలీస్ అధికారులతో బందోబస్తు ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు. ముఖ్యప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ సంవత్సరం మొదటి మూడు రోజులకు భక్తులకు ఎ లక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేసిన ట్లు చెప్పారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు న కిలీ టోకెన్లు జారీ చేసి భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. నకిలీ టోకెన్లతో వచ్చిన భక్తులకు అనుమ తి ఉండదని, నకిలీ టోకెన్లు ఇచ్చిన వారిపైనా, తీసుకొచ్చిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నా రు.


