దక్షిణాది యువజనోత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ ఎస్వీయూ
తిరుపతి సిటీ: దక్షిణాది రాష్ట్రాల యువజనోత్సవాల్లో ఎస్వీయూ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడం ఎంతో గర్వకారణమని ఆ వర్సిటీ వీసీ నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. యువజన ఉత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి యూనివర్సిటీకి వచ్చిన కళాబృందాలను బుధవారం వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ దక్షిణాదిలోనే ఎస్వీ యూనివర్సిటీ ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కై వసం చేసుకోవడం గర్వకారణమన్నారు. వారిని ప్రోత్సహించిన కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విజేతలు సాధించిన జ్ఞాపికలను యూనివర్సిటీ కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ అధికారులకు అందజేశారు. ఈ సీడీసీ డీన్ ప్రొఫెసర్ చెండ్రాయుడు, కల్చరల్ అఫైర్స్ మాజీ డైరెక్టర్ కేఎం భాను, కళ్యాణ్ పాల్గొన్నారు.


