గ్రేటర్‌ హంగులు.. | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ హంగులు..

Nov 21 2025 7:39 AM | Updated on Nov 21 2025 7:41 AM

● సర్కారు భూములున్న పంచాయతీల జోలికెళ్లని అధికారులు ● అలాంటి వాటిని కలిపేందుకు ఇష్టపడని ఎమ్మెల్యేలు

నేటి పరిస్థితిలో తిరుపతి పట్టణాభివృద్ధి జరగాలంటే నిధులు అవసరం.. ఆ నిధులు ఎక్కడి నుంచి తేవాలన్నది శేష ప్రశ్న. ఉన్నది ఒకటే మార్గం.. అదే కేంద్ర నిధుల సముపార్జన. అందుకు తిరునగరిని గ్రేటర్‌ తిరుపతిగా రూపొందిస్తే కావాల్సినన్ని నిధులు సమకూరుతాయి. ఇందుకు తొలి అడుగు పడింది. అయితే చంద్రబాబు సర్కారులోని పెద్దలు, ప్రజాప్రతినిధులు ఇందులో పలు కొర్రీలు పెడుతున్నారు. పరిధి ఇంతే ఉండాలి.. అంతే ఉండాలన్న ఆంక్షలు విధించి, అధికారులను గుప్పెట్లో పెట్టుకుని గ్రేటర్‌కు గండి పెడుతున్నారు. గ్రేటర్‌ హంగులకు అడుగడుగనా ఆటంకం కలిస్తున్నారు.

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇలా..

ప్రస్తుత మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి

30.17 చదరపు కిలోమీటర్లు

జనాభా 4.50 లక్షలు

వార్షిక ఆదాయం రూ. 150 కోట్లు

గ్రేటర్‌ ప్రతిపాదిత వివరాలు

విలీనమయ్యే పంచాయతీలు 63

పరిధి 300 చదరపు కిలోమీటర్లు

జనాభా 3.40 లక్షలు

వార్షిక ఆదాయం రూ.68 కోట్లు

తిరుపతి తుడా: గ్రేటర్‌ తిరుపతి ప్రతిపాదనలో ఎన్నో మతలబులు చోటుచేసుకున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు అనుగుణంగా గ్రేటర్‌ డ్రాఫ్ట్‌ ఉండడంపై నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూ, నీటి వనరులు పుష్కలంగా ఉన్న పంచాయతీలను పక్కన పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో ఓ భవనం కట్టాలన్న అవసరమైన స్థలం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్కు వనరులు సమకూర్చే దిశగా గ్రేటర్‌ ప్రతిపాదన చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఎవరి మెప్పు కోసం లోపభూయిష్టంగా ప్రతిపాదనలు చేశారని ఇటీవల జరిగిన కౌన్సిల్‌లో తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దెల గురుమూర్తి నిలదీశారు. గ్రేటర్‌ తిరుపతి వంటి ప్రతిష్టాత్మక డ్రాఫ్ట్‌ ని తయారు చేసేటప్పుడు నిపుణులతో కూడిన కమిటీ వేయడంతోపాటు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకపోవడం సరైంది కాదని ఆయన కుండలు బద్దలు కొట్టారు. విలీన డ్రాఫ్ట్‌ రూపొందించడంలో అధికారులు సరైన రీతిలో వ్యవహరించలేదని ఆయన విమర్శించారు.

ఆ పంచాయతీల జోలికి వెళ్లని అధికారులు

చంద్రగిరి మండలంలోని నరసింగాపురం నుంచి కళ్యాణి డ్యామ్‌ వరకు, అలానే డోర్నకంబాల నుంచి రాయలచెరువు వరకు, అక్కడి నుంచి వడమాలపేట, పాపా నాయుడు పేట, అంతర్జాతీయ విమానాశ్రయం, ఏర్పేడు ఐఐటీ వరకు విలీనం చేస్తే తిరుపతికి మరింత ప్రత్యేకత ఏర్పడుతుందని, అవసరమైన వనరులు సమకూరుతాయని పట్టుపడుతున్నారు. రేణిగుంట మండలంలో అత్తూరును చేర్చిన అధికారులు తిరుపతికి సమీపంలోని బాలకృష్ణాపురాన్ని చేర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పంచాయతీ పరిధిలో సుమారు 30 ఎకరాల ప్ర భుత్వ భూమి ఉందని, స్థానిక ప్రజా ప్రతినిధి విజ్ఞప్తి మేరకు ఆ పంచాయతీని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అలానే నరసింగాపురం నుంచి కళ్యాణ్‌ వరకు ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేస్తే భూ ములు కొట్టేయడం అంత సులువు కాదన్న ఆలోచనతోనే ప్రజాప్రతినిధులు అలాంటి వాటికి నో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగిరి ఎ మ్మెల్యేల సూచనల మేరకే అనేక విలువైన (ప్రభుత్వ భూ వనరులున్న) పంచాయతీలను కార్పొరేషన్‌ లో విలీనం కాకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్‌ లోకి ప్రభుత్వ భూములు వెళితే కబ్జాకు అవకాశం ఉండదని భావించిన ప్రజాప్రతినిధులు అలాంటి పంచాయతీలను విలీనం చేసేందుకు ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే అనేక అనువైన పంచాయతీలను విలీనంలోకి రాకుండా పావులు కదిపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కళ్యాణి డ్యామ్‌ నుంచి ఐఐటీ వరకు ఎందుకంటే..!

తిరుపతిలో ప్రభుత్వ భూములు ఒక శాతం కూడా లేవన్నది జగమెరిగిన సత్యం. భవిష్యత్తుకు అవసరాలకు ఉపయోగపడే భూ, జన వనరుల సమస్య తిరుపతిని వేధిస్తోంది. గ్రేటర్‌ తిరుపతితోనైనా ఆ సమస్య తీరుతుందన్నది వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్ల ఆలోచన. ఈ క్రమంలోనే తిరుపతికి అవసరమైన భూ, జన వనరులు పుష్కలంగా లభించాలంటే కళ్యాణి డ్యామ్‌ నుంచి రాయల చెరువు, వడమాలపేట , అంతర్జాతీయ విమానాశ్రయం, ఏర్పేడు ఐఐటీ వరకు విస్తరించాలని నిపుణులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్‌ శిరీషతోపాటు వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లందరూ కౌన్సిల్లో డిమాండ్‌ చేశారు. ఈ ప్రతిపాదికన విలీనం చేస్తే అవసరమైన వనరులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయని డిమాండ్‌ చేస్తున్నారు.

వైఎస్సార్‌ చొరవతోనే కార్పొరేషన్‌గా తిరుపతి

తిరుపతి మున్సిపాలిటీగా వంద ఏళ్ల చరిత్ర ఉన్న తిరుపతి కుగ్రామంగానే మిగిలిపోయింది. తిరుపతిని కార్పొరేషన్‌ గా అప్‌గ్రేడ్‌ చేయాలన్న ఆలోచన నాటి ముఖ్యమంత్రులెవరూ చేయలేకపోయారు. భూమన కరుణాకరరెడ్డి అభ్యర్థన మేరకు తిరుప తి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదన ముందుకు కదిలింది. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అన్ని అడ్డంకుల తొలగి, 2008లో మున్సిపాలిటీగా ఉన్న తిరుపతి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ గా అవతరించింది. దీంతో ఎంఆర్‌ పల్లి, రాజీవ్‌ నగర్‌, తిమ్మినాయుడుపాళెం మేజర్‌ పంచాయతీలు కార్పొరేషన్‌ లో విలీనం అయ్యాయి.

పది లక్షలకు పైగా జనాభా కేటగిరి ఎందుకంట?

మూడు లక్షలలోపు ఆపై కేటగిరీ ఐదు లక్షల లోపు, ఐదు నుంచి 10 లక్షల వరకు, పది నుంచి 15 లక్షల లోపు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటగిరీల వారీగా నిధులను నగరాభివృద్ధికి విడుదల చేస్తుంది. ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్‌ 2011 జనాభా లెక్కల ప్రకారం మూడు లక్షల లోపు కేటగిరీలో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనన్ని నిధులు రావడం లేదు. జనాభా కేటగిరీ వారీగా నిధులు రెట్టింపు స్థాయిలో ఆ యా నగరాలకు రూ.కోట్లలో అందిస్తోంది. మౌలిక వసతుల కల్పన, అ ర్బన్‌ హౌసింగ్‌, ఇతర ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను కేటాయించాలంటే జనాభా ప్రతిపాదికన నిధులను విభజించి, విడుదల చేస్తుంది. ఉదాహరణకు మూడు లక్షల లోపు జనాభా కలిగిన నగరాలకు రూ.150 కోట్లు కే టాయిస్తే 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకు ఆ లెక్కన రూ.850 కోట్ల పైగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయా రాష్ట్రాల సీఎంల ఆధారంగా ఆ నిధులు మరింతగా తెప్పించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ క్రమంలోనే 10 లక్షలకు పైగా జనాభాతో కూడిన గ్రేటర్‌ తిరుపతి కావాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పట్టుపడుతున్నారు. ఈ లెక్కన గ్రేటర్‌ను చేస్తే 600 చదరపు కిలోమీటర్ల పరిధి వస్తుందని కౌన్సిల్లో కమిషనర్‌ స్పష్టం చేశారు.

గ్రేటర్‌ హంగులు..1
1/1

గ్రేటర్‌ హంగులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement