ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది.. | - | Sakshi
Sakshi News home page

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..

Nov 21 2025 7:39 AM | Updated on Nov 21 2025 7:39 AM

ఇల్లు

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..

సొమ్ము ఒకడిది.. సోకు ఒకరిదా? జగనన్న స్థలం ఇల్లు ఇస్తే.. కూటమి ఎమ్మెల్యే ప్రారంభిస్తుందా?

సూళ్లూరుపేట:హవ్వా.. ఎంతమోసం.. ఎంత మోసం.. సొమ్మొకరిది.. సోకు ఒకరిదా? జగనన్న ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు కట్టిస్తే వాటిని ఈ ప్రభుత్వమే కట్టినట్టుగా కలరింగ్‌ ఇచ్చి ప్రారంభిచడమా? ఇదేమి చోద్యం అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెట్టినట్టుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు కలరింగ్‌ ఇచ్చి, టీడీపీ నాయకు లు ప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 17 నెలల కూటమి ప్రభుత్వ హయాంలో ఒక సెంటు స్థలం గానీ, ఇల్లుగానీ మంజూరు చేయకుండా ఇళ్లు తామే నిర్మించామనే పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు చేతులు మీదుగా ఇళ్లు ప్రారంభించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారుపోలూరులో రూ.3 కోట్లు వ్యయంతో సుమారు పది ఎకరాల భూమిని చదును చేసి, 754 మంది ఇళ్ల స్థలాలను పేదలకు అందజేశారు. ప్రస్తుతం మన్నారుపోలూరులో జగనన్న కాలనీ ఇచ్చిన చోట ఒక గ్రామమే రూపుదిద్దుకుంది. ఎంతో మంది ఇంటి స్థలం, ఇల్లు లేని నిరుపేదలకు సుమారు రూ.8లక్షల విలువ చేసే స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి మరో రూ.2 లక్షలు ఇచ్చి, ప్రతి నిరుపేద కుటుంబాన్ని రూ.10 లక్షల ఆస్తికి యజమానులుగా చేశారు. అయితే ఇందులో 60 శాతం మంది ఇళ్లు పూర్తి చేసుకుని కాపురాలు ఉంటున్నారు. మరో 30 శాతం ఇళ్లు ఇంకా నిర్మాణదశలోనే ఉన్నాయి. 10 శాతం మంది మాత్రమే ఇంకా ఇంటి నిర్మాణాలు చేపట్టలేదు. 30 శాతం ఇళ్లు వివిధ దశల్లో ఉన్నపుడే 2024లో ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ఇంటి నిర్మాణాలకు సంబంఽధించి బిల్లులు అగిపోయాయి. కాని లబ్ధిదారులు మాత్రం అప్పులు చేసుకుని, నిర్మాణాలు పూర్తి చేసుకుని చాలామంది గృహప్రవేశాలు చేసేశారు. బాబు సర్కారు వచ్చిన తరువాత 17 నెలల కాలంలో సెంటు స్థలం ఇచ్చింది లేదు. ఒక్క ఇల్లు కట్టింది లేదు. కానీ సీఎం చంద్రబాబు రూ.3 లక్షల ఇళ్లు ఇచ్చామని, తామే ఇల్లు కట్టినట్టుగా బిల్డఫ్‌ చేసి, వారి ఎమ్మెల్యేల చేతులు మీదుగా ప్రారంభించడంపై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించి, మోసం చేస్తుందనడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. ఒక్క పేదవాడికి సెంటు స్థలం ఇవ్వకుండా, ఒక్క ఇంటిని మంజూరు చేయకుండా ఇదేమి మోసమని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే ప్రశ్నించే స్థాయికి దిగజారిపోతున్నారు. జగనన్న కాలనీలో జగనన్న మంజారు చేసిన ఇంటి స్థలంలో ఇల్లు పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఇప్పుడు బిల్లులు వేసి, ఆ ఇళ్లను తామే నిర్మించినట్టుగా భావించళ్లైదు ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతులు మీదుగా గృహప్రవేశాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రభుత్వంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు చేయవచ్చు గానీ ఈ పనిని తామే చేశామని, గొప్పలు చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు. జగనన్న మంజూరు చేసిన ఇళ్లు, ఇంటి స్థలాలు తామే ఇచ్చినట్టుగా చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 17 నెలల కూటమి ప్రభుత్వం కాలంలో 3 లక్షలు ఇళ్లు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేసి, ప్రారంభిస్తున్నామని చెప్పడం విడ్డూరమే.

ఇదేమి చోద్యం?

కర్ర ఉన్న వాడిదే బర్రె అన్న చందంగా ఉంది.. పక్కా ఇళ్ల గృహప్రవేశాల తీరు. పేదల తలరాత మార్చాలని నాడు జగనన్న చేసిన కృషిని తమదిగా చెప్పుకుంటున్నారు టీడీపీ నేతలు.. పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న సంకల్పంతో నాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు కాలనీ ఏర్పాటు చేసి, పేదలకు సొంతింటి కల సాకారానికి కృషి చేశారు. ఆ ఇళ్లు నిర్మాణాలు పూర్తి అయ్యే దశలో ఎన్నికలు రావడంతో బిల్లులు ఆగిపోయాయి. అయితే లబ్ధిదారులు నానా తిప్పలు పడి, ఇళ్లను పూర్తి చేసుకుని, గృహప్రవేశాలు చేశారు. వాటికి చివరి బిల్లులు ఇచ్చి తమ ప్రభుత్వమే ఇళ్లు ఇచ్చినట్లు చెప్పుంటున్నారు టీడీపీ నేతలు. ఇదేమీ చోద్యమో అని జనం ఛీకొడుతున్నారు.

మేము గృహప్రవేశం చేసి సంవత్సరమైంది

ఆయ్యా జగనన్న ప్రభుత్వంలో మాకు అంటే నా భార్య సుధ పేరున ఇంటి స్థలం ఇచ్చారు. ఈ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు మంజూరు చేశారు. అంతకు ముందు మేము మన్నారుపోలూరులోని అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. మాకు స్థలం, ఇల్లు మంజూరు చేయడంతో మేము సంవత్సరం క్రితమే ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం కూడా చేసేశాం. ఈ ఇంటికి సంబంధించి బిల్లులు పడలేదు. ఎందుకంటే బ్యాంక్‌ ఖాతాలో ఏదో తప్పు దొర్లిందని అధికారులు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు కోసం తిరుగుతుంటే బిల్లులు కింద ఈ నెలలో రూ.1.67 లక్షల డబ్బులు పడ్డాయి. దీన్ని తీసి అప్పులు చేసిన వారికి ఇచ్చేశాం. అయితే బిల్లులు ఇప్పడు వచ్చినందున మాకు ఇచ్చిన ఇంటిని ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారని అధికారులు చెప్పడంతో అంగీకరించి, రెండోసారి గృహప్రవేశం చేశాం. – కర్లపూడి రమణయ్య,, మన్నారుపోలూరు

ఇంటి స్థలం, ఇల్లు ఇచ్చింది జగనన్నే

నా భర్త కూలీ పని చేస్తుంటారు. మాకు సొంత ఇంటి స్థలం గానీ, ఇల్లు గానీ లేదు. అద్దె ఇంట్లో నివాసం ఉండేవారం. మేము నిరుపేదలు కావడంతో జగనన్న ప్రభుత్వంలో ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మాకు మన్నారుపోలూరు జగనన్న కాలనీలో 2021–22 సంవత్సరంలో స్థలం ఇచ్చి, ఇల్లు మంజూరు చేశారు. మేమే శ్రమదానం చేసుకుని చిన్న ఇల్లు నిర్మించుకుని, గహప్రవేశం కూడా చేసుకుని ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉంటున్నాం. దీనికి అప్పట్లో బిల్లులు పెట్టారు గానీ అప్పుడే ఎన్నికలు రావడంతో అక్కౌంట్‌లో బిల్లులు పడలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిల్లులు పడ్డాయని, ఎమ్మెల్యే ఇంటిని ప్రారంభిస్తారని అధికారులు చెప్పడంతో మళ్లీ గృహప్రవేశం చేశాం. – తోట అనూరాధ, మన్నారుపోలూరు

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..1
1/5

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..2
2/5

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..3
3/5

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..4
4/5

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..5
5/5

ఇల్లు జగనన్నది.. పేరు పచ్చనేతలది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement