వేమూరులో తమిళనాడు రైతుల విజ్ఞాన యాత్ర
తిరుపతి రూరల్: తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లాకు చెందిన 20 మంది రైతులు ‘ఆత్మ’ సౌజన్యంతో నాలుగు రోజుల విజ్ఞాన యాత్రకు గురువారం మండలంలోని వేమూరుకు వచ్చారు. రాస్ కృషి విజ్ఞాన కేంద్రం దత్తత రైతు అయ్యప్ప నాయుడు ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తున్న చెరకు, మల్బరీ, పంటలు, సాగుకు ఆచరిస్తున్న పద్ధతు లు, పట్టు పురుగుల పెంపకం, ఘన, ద్రవ జీవామృతం, పంచగవ్య, దశపర్ణి కషాయం, అగ్ని అస్త్రం కషాయాల తయారీ గురించి తెలసుకు న్నారు. రాస్ కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని, ఆరోగ్యకరమైన వ్యవసాయోత్పత్తులు ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమని గుర్తెరగాలన్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రకృతి వ్యవసా య సాగుకు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో వేలూరు జిల్లాకు చెందిన ఆత్మ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


