హనుమ ‘కల్ప’ శోభితం.. పద్మావతి వైభవం
చంద్రగిరి: పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం రాత్రి 8 గంటలకు అమ్మవారు హనుమంత వాహనంపై పట్టాభిరాముడు అలంకరణలో నాలుగు మాడవీధుల్లో విహరించారు. ఉదయం 4 గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి, నిత్యకై ంకర్యాలు నిర్వహించారు. ఆలయంలోని అద్దాలమండపం నుంచి వాహనమండపానికి అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి, ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. మురళీకృష్ణుడి అలంకరణలో మురళీనాదాన్ని ధరించిన శ్రీపద్మావతి అమ్మవారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం అమ్మవారికి వేడుకగా స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌సేవ జరిగింది. రాత్రి హనుమంత వాహనంపై అమ్మవారు పట్టాభిరాముడు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్‌ఓ మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
హనుమ ‘కల్ప’ శోభితం.. పద్మావతి వైభవం


