విలీన తోవ.. | - | Sakshi
Sakshi News home page

విలీన తోవ..

Nov 21 2025 6:56 AM | Updated on Nov 21 2025 6:56 AM

విలీన

విలీన తోవ..

జిల్లాలో ఫైలెట్‌ ప్రాజెక్టుగా

శ్రీకాళహస్తి అర్బన్‌

పిల్లల సంఖ్య, వసతులపై ఓ కమిటీ సర్వే

పిల్లలు తక్కువ ఉంటే విలీనం తప్పదు

తిరుపతి అర్బన్‌: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ సెక్టార్లు నిర్వీర్యం అయిపోతున్నాయి. ప్రైవేటు దిశగా అడుగులు వేస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. ప్రధానంగా గత వైఎస్సార్‌సీపీ సర్కార్‌లో చేసిన మంచిని తుడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగా విద్య, వైద్య రంగాలను చిన్నాభిన్నం చేస్తున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల కు మంగళం

చంద్రబాబు గత ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాటిని గాలికివదిలేశారు. దీంతో వారంతా న్యాయ పోరాటాలకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసి, వారి దృష్టి అటువైపు తిప్పుతున్నారని చర్చసాగుతోంది. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే మెరుగైన విద్య పేరుతో ఆ కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాలల్లో విలీనానికి సర్వేలు మొదలు పెట్టారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో మండల విద్యాశాఖాధికారి(ఎంఈఓ) చైర్మన్‌గా, ఐసీడీఎస్‌ పరిధిలోని చైల్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ (సీడీపీఓ) వైస్‌ చైర్మన్‌గా, సభ్యులుగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అంగన్‌వాడీ కార్యకర్త, స్కూల్‌ కమిటీ చైర్మన్‌, ఎస్‌హెచ్‌జీఎస్‌, మదర్స్‌ కమిటీని చేర్చారు.

పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు కష్టాలు తప్పవా?

చంద్రబాబు పాలనలో చివరికి అంగన్‌వాడీ పరిధిలోని చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు కష్టాలు తప్పేలాలేవు. సాధారణంగా అంగన్‌వాడీ కేంద్రం అంటే తమ ఇంటికి సమీపంలోనే ఉంటుంది. అయితే అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేస్తున్న నేపథ్యంలో కిలోమీటరు దూరం వెళ్లాలంటే చిన్న పిల్లలకు ఇబ్బందులు తప్పవని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అలాగే బాలింతలు, గర్భిణులకూ ఇక్కట్లు తప్పలా లేవని అంతా చర్చించుకుంటున్నారు.

శ్రీకాళహస్తి అర్బన్‌లో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కమిటీ

విలీనం దిశగా

అంగన్‌వాడీ కేంద్రాలు

పైలెట్‌ ప్రాజెక్టుగా శ్రీకాళహస్తి అర్బన్‌

అంగన్‌వాడీ కేంద్రాల విలీనానికి ఒక్కొక్క జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేశారు. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి అర్బన్‌(టౌన్‌) మండలాన్ని ఎంపిక చేసి, సర్వే చేపట్టారు. ఈ సర్వే ఇప్పటికే 50 శాతం పూర్తి చేశారు. శ్రీకాళహస్తి అర్బన్‌ పరిధిలో 28 ప్రాథమిక పాఠశాలలున్నాయి. 42 అంగన్‌వాడీ కేంద్రాలు న్నాయి. 42 అంగన్‌వాడీ కేంద్రాల్లో 621 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటికే సర్వే చేసిన లెక్కల ప్రకారం ఏడు అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేశారు. మిగిలిన 50 శాతం సర్వే పూర్తి చేసిన తర్వాత ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలు విలీనం చేస్తారో తెలియడం లేదు. ఎన్ని కేంద్రాలు పోతాయో? ఎన్ని మిగులుతాయోనని చిన్నపిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫైలెట్‌ ప్రాజెక్టు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత జిల్లాలో మిలిగిన 33 మండలాల్లోనూ సర్వే చేసి, విలీనం చేస్తారన్న చర్చసాగుతుంది.

విలీన తోవ..1
1/1

విలీన తోవ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement