వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన నేత
తిరుపతి కల్చరల్: గిరిపురం ప్రాంతానికి చెందిన జనసేన నాయకుడు సాయి గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వకర్త భూమన అభినయరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కట్టా గోపియాదవ్, బాలాజీ, కోదండ పాల్గొన్నారు.
సర్వే నంబర్ 80–ఏలో ఆగని ఆక్రమణలు
– ఆక్రమణల పాలవుతున్నా నోటీసులతో సరి!
చంద్రగిరి: చంద్రబాబు సర్కారులో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. మండలంలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. నోటీసులతోనే సరిపుచ్చుతున్నారనే విమర్శలొస్తున్నాయి. వివరాలు..మండలంలో ఏ.రంగంపేట సమీపంలోని నాగపట్ల లెక్కదాఖల సర్వే నంబరు 80–ఏ లోని ప్రభుత్వ భూమిలో గత ఏడాదిగా ఆక్రమణల పరంపరం కొనసాగుతూనే ఉంది. గత ఏడాది దీనిపై పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు కదిలారు. ప్రభుత్వ భూమి అంటూ పంచాయతీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో తాత్కాలికంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. అయితే మళ్లీ 10 రోజులుగా 80–ఏలోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు ఊపందుకున్నాయి. గతంలో ఉన్న దానికన్నా అధికంగా ప్రభుత్వ భూమిని చదును చూసి ఆక్రమణలకు పాల్పడుతున్నారని, అధికార టీడీపీ నాయకుల అండతోనే లక్షలాది విలువైన భూములను ఆక్రమించుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై తహసీల్దార్ శివరామసుబ్బయ్యను వివరణ కోరగా..ఇప్పటికే ప్రభుత్వ ఆక్రమణలపై పంచాయతీ అధికారులకు నోటీసులు జారీ చేశామని, తదుపరి చర్యలు తీసుకోవలసింది పంచాయతీ అధికారులేనన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు మణియ్య ఎంపిక
నాగలాపురం: పిచ్చాటూరు మండలంలోని కారూరు ప్రాఽథమిక పాఠశాల టీచర్ ఐ.మణియ్య రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ మీట్ ఎంపికయ్యారని ఎంఈఓ హేమమాలిని గురువారం తెలిపారు. ఇటీవల జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో 400, 800 మీటర్ల పరుగు పందెం, క్రికెట్ పోటీలో ప్రతిభ చాటడడంతో ఆయన్ను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు చెప్పారు. మణియ్యను ఎంఈఓతోపాటు ఎంఈఓ –2 యుగంధర్ రాజు, ఉపాధ్యాలు శాలువ కప్పి సన్మానించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు.
వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన నేత


