సింగపూర్ విద్యా అధ్యయన యాత్రకు ఉపాధ్యాయుడు బాలు
తొట్టంబేడు: ఈ ఏడాది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యా య అవార్డు అందుకున్న తొట్టంబేడు మండలం దిగువ సాంబ య్య పాళెం ఫౌండేషన్ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కయ్యూరు బాలసుబ్రహ్మ ణ్యంను రాష్ట్ర పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) విద్యాశాఖ తరఫున విద్యా అధ్య యన యాత్రకు సింగపూర్ పంపిస్తున్న ట్టు విద్యాభవన్ విజయవాడ కార్యాలయం తెలిపింది. ఈనెల 27 నుంచి డిసెంబర్ 2 వరకు వారం రోజులు సింగపూర్‌లో విద్యా సంస్థలను ఆయన సందర్శిస్తారు. అక్కడి విద్యా సంస్కరణల స్థితిగతులపై అధ్యయనం చేసి, రాష్ట్ర విద్యా శాఖకు నివేదికను ఇవ్వనున్నారు. సహచర ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యో గులు బాలుకు అభినందనలు తెలిపారు.


