ఆర్చరీ పోటీల్లో గూడూరు విద్యార్థికి పసిడి పతకం
గూడూరు రూరల్: పట్టణంలోని లయోలా జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి జి వెంకటలోకేష్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో బంగారు పతకం కై వసం చేసుకున్నాడు. విజయవాడలో జరిగిన సబ్ జూనియర్ ఇండియన్ రౌండ్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే రాష్ట్ర స్థాయి స్కూల్ క్రీడా పోటీల్లో రజిత పతకం, ఇండియా జూనియర్, సీనియర్ మీట్‌లో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. దీంతో ఆ విద్యార్థికి నవంబర్ 24 నుంచి 30 వరకు అరుణాచల్ ప్రదేశ్‌లో జరగనున్న జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించిందని ప్రిన్సిపల్ తెలిపారు. కోచ్ శివశంకర్ శిక్షణతోనే రాణించార న్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజనారాయణ, వైఎస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్, కరస్పాండెంట్ పంట శ్రీనివాసులరెడ్డి వారిని అభినందించారు.


