భూ సంరక్షణ అందరి బాధ్యత
తిరుపతి సిటీ: భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి పిలుపునిచ్చారు. మహిళా వర్సిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం వర్సిటీలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిలో జీవరాశులన్నీ భూమిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నాయని, బాధ్యతగా భూమిని కాపాడుకోవాలన్నారు. వీసీ ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుతూ భూమికి పునర్జీవం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రీన్ ఆంధ్ర చాలెంజ్–2025 పోస్టర్‌ను ఆవిష్కరించారు. సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ సీఈఓ వెంకటేశ్వర్లు, ఎన్విరాన్‌మెంట్ కార్యకర్త శివాజి, రిజిస్ట్రార్ రజిని, దామోదరంనాయుడు, మార్కండేయులు రెడ్డి, విజయ్‌కుమార్‌నాయుడు, ప్రొఫెసర్ ఆర్.రమణమూర్తి, ప్రొఫెసర్ ఉష, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


