రైతులకు తప్పని ఇక్కట్లు
సైదాపురం : వెంకటగిరి నియోజకవర్గంలో రైతు సేవా కేంద్రాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. పలుచోట్ల ఆర్‌ఎస్‌కేలను మూసేశారు. కొన్నిచోట్ల గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను ప్రారంభించేందుకు సైతం ఇప్పటి పాలకులకు తీరిక లేకుండా పోయింది. గతంలో ఇంటికే ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వచ్చేవి. పంట ఉత్పత్తులను సులభతంగా రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఓ బస్తా యూరియా పొందాలంటే రైతులు యుద్ధం చేయాల్సిన దుస్థితి దాపురించింది. గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది. అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు.


