శ్రీవారి దర్శనానికి 8 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

Jan 12 2026 6:31 AM | Updated on Jan 12 2026 6:31 AM

శ్రీవ

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 76,820 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,368 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించు కోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్‌’

తిరుపతి అర్బన్‌ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ (గ్రీవెన్స్‌) నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరించనున్నారు. ఆదివారం ఈ మేరకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ గ్రీవెన్స్‌కు ప్రతి విభాగానికి చెందిన ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించా రు. అర్జీదారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రధానంగా తా గునీరు. కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ క్రమంలోనే వినతులు రాసే సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని, అర్జీదారులతో గౌరవంగా నడుచుకోవాలని కోరారు.

ఎమ్మెస్సీ ఫలితాల విడుదల

తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో గత ఏడాది జనవరిలో నిర్వహించి ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం ఫస్ట్‌ సెమిస్టర్‌ ఫలితాలను వర్సిటీ అధికారులు ఎట్టకేలకు విడుదల చేశారు. ఫలితాల విడుదలలో జాప్యంపై సాక్షి పత్రికలో పలు మార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎమ్మె స్సీ మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కో ర్సులకు సంబంధించి ఫలితాలు ఏడాదిగా విడుదల కాకపోవడంపై విద్యార్థి సంఘాలు సైతం నిరసన తెలిపాయి.ఈ క్రమంలో వర్సిటీ అధికారులు స్పందించి ఫలితాలు విడుదల చేశారు. అధికార వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

టీటీడీలో ఉద్యోగాలకు అవకాశం

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: టీటీడీలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిసింది. ఎస్వీ గో సంరక్షణశాలలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టు లు 2, గోశాల మేనేజర్‌–2, డెయిరీ సూపర్‌ వైజర్‌–6, డెయిరీ అసిస్టెంట్‌–2 మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే తాళ్లపాక కై ంకర్యపరుడు, మణ్యం దార్‌ పోస్టుల నియామకానికి నిబంధన లను ఖరారు చేశారు. కై ంకర్యపరుడి పోస్టుకు తాళ్లపాక సంకీర్తనల్లో ప్రావీణ్యం సర్టిఫికెట్‌ ఉండాలి. 40 ఏళ్లు మించకుండా మణ్యం దార్‌ పోస్టు కు 8వ తరగతి ఉత్తీర్ణులైన, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు అర్హులు. బర్డ్‌లో రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఆర్థోపెడిక్స్‌ లేదా అనస్తీషియాలో పీజీ, డిగ్రీ లేదా డిప్లొమాను అర్హతను నిర్ణయించారు. శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో ప్రొడక్షన్‌ సూపర్‌వైజర్‌ పోస్టుకు బీఏఎంఎస్‌ లేదా బీ ఫార్మసీ (ఆయుర్వేద) డిగ్రీతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలనే సవరణ చేశారు. టీటీడీ వైద్య విభాగానికి సంబంధించి మూడు దశాబ్దాలుగా ఒకే చోట పనిచేస్తున్న సిబ్బందిని అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేడియోగ్రాఫర్‌ పోస్టును చీఫ్‌ రేడియోగ్రాఫర్‌గా పెంచడం, ఫిజయోథెరపిస్టు పోస్టును అప్‌గ్రేడ్‌ చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

ఘనంగా

సంజీవరాయునికి పొంగళ్లు

పుల్లంపేట : మండలంలోని తిప్పాయపల్లెలో ఆదివారం సంజీవరాయస్వామివారికి ఘనంగా పొంగళ్లు పొంగించారు. ఈ ప్రత్యేక వేడుకకు దేశవిదేశాల్లో స్థిరపడిన తిప్పాయపల్లె వాసులు తరలివచ్చారు. ప్రతి సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు స్వామివారికి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆలయంలోకి మహిళలు, దళితులకు ప్రవేశం లేదు. ఈ క్రమంలో కేవలం పురుషులు మాత్రమే పొంగళ్లు పొంగించడం విశేషం. పురాతన సంప్రదాయాలను గౌరవిస్తూ దళితులు సైతం ఆలయ ప్రవేశం కోరకపోవడం గమనార్హం. మహిళలు గుడి బయట ముఖద్వారం నుంచే స్వామిని మొక్కుకుంటూ ఉంటారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు 
1
1/1

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement