పని చేయడం లేదు
పుల్లంపేట : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే చంద్రబాబు సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. అన్నదాతకు మేలు చేకూర్చే రైతు సేవాకేంద్రాలను మూసేస్తోంది. కొన్ని చోట్ల ఆయా భవనాల్లో దొంగలు పడి ఫర్నీచర్‌ను అపహరించినా పట్టించుకోవడం లేదు. ఆర్‌ఎస్‌కేల్లో కూటమి నేతలే చోరీలు చేయిస్తున్నారనే ఆరోపణలు సైతం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పుల్లంపేట మండలంలోని 11 ఆర్‌బీకేలను చంద్రబాబు ప్రభుత్వం 6కే పరిమితం చేసింది. దీంతో మిగిలినవి దొంగలపాలయ్యాయి. పలు భవనాలను అప్పట్లోనే ప్రారంభించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా మూసేశారు. ఆర్‌బీకేలను ఆర్‌ఎస్‌కేలుగా మార్చడంలో చూపిన శ్రద్ధలో పావు వంతు కూడా అన్నదాతలకు సేవలందించడంపై చంద్రబాబు ప్రభుత్వం చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


