సేవ..లే!
ప్రభుత్వమంటే పక్షపాత రహితంగా పాలన అందించాలి. రాగద్వేషాలకు అతీతంగా సేవలు అందించాలి. కక్షపూరిత వైఖరిని విడిచిపెట్టాలి. ప్రజలకు మేలు చేకూర్చే పథకాలను సక్రమంగా అమలు చేయాలి. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసింది. అందులో భాగంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. ముందుగా రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చడమే కాకుండా పలు సెంటర్లను మూసేసింది. అన్నదాతలకు సేవలను దూరం చేసి నిరుపయోగంగా తయారుచేసింది. చివరకు పలు చోట్ల గోదాములుగా మార్చేసి ఉన్నత లక్ష్యాలను నీరుగార్చేస్తోంది.
మూతపడింది
వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం మత్తేరిమిట్ట గ్రామంలోని రైతు సేవా కేంద్రం మూతపడింది. దీంతో రైతులకు ఏలాంటి సమస్య వచ్చినా మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 87 రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. ఇప్పుడు అందులో సగం కూడా లేవు. అలాగే సిబ్బందిని సైతం పూర్తిగా కుదించేశారు. మిగిలిన అరకొర ఉద్యోగులను సర్వేల పేరుతో అందుబాటులో లేకుండా చేశారు. దీంతో ప్రభుత్వ సేవలు అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
తిరుపతి అర్బన్ : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్నదాతలకు క్షేత్రస్థాయిలో అండగా నిలిచేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత ఆశయంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎరువులు, పురుగుమందుల కోసం రైతులు దూరాభారం వెళ్లాల్సిన పనిలేకుండా సొంత ఊరిలోనే అందుబాటులోకి తీసుకువచ్చారు. అవసరాలకు అనుగుణంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లను నియమించి పంటల సాగుకు కావాల్సిన సలహాలను అందించేలా విప్లవాత్మక విధానాలను ప్రవేశపెట్టారు. దీంతో రైతులు సైతం తమకు కావాల్సిన రాయితీ విత్తనాలు, పనిముట్లు, ఎరువులు, సంక్షేమ పథకాలు, ఉచిత పంట బీమా సౌకర్యాలను సులభతరంగా పొందేవారు. ధాన్యం కొనుగోళ్లు సైతం రైతు భరోసా కేంద్రాల ద్వారా జరిగేవి. ఈ–క్రాప్ నమోదు, ఈకేవైసీ తదితరాలను ఆయా కేంద్రాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు పూర్తి చేసేవారు.
బాబు పాలనలో అన్నీ అవస్థలే!
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతలకు మేలు చేయడం వదిలేసి ముందుగా పేర్ల మార్పుపైనే దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఆర్‌బీకేలను రైతు సేవా కేంద్రాలు(ఆక్‌ఎస్‌కే)గా మార్చేసింది. తర్వాత ఆర్‌ఎస్‌కేలను దాదాపు 45 శాతం తగ్గించింది. అగ్రికల్చర్ అసిస్టెంట్లను సైతం పూర్తిస్థాయిలో నియమించకుండా కుట్రపూరితంగా వ్యవహరించింది. చివరకు అన్నదాతలకు సేవలందించాల్సిన ఆర్‌ఎస్‌కేలను వేరే వాటికి ఉపయోగించుకుంటూ ఉన్నత ఆశయానికి తూట్లు పొడిచేసింది. ఈ క్రమంలోనే పలు చోట్ల రైతు సేవా కేంద్రాలు గోదాములుగా మారిపోయాయి.
నిరుపయోగం
తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గంలోని రైతు భరోసా కేంద్రాలు నిరుపయోగంగా మారా యి. గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నిల్వ ఉంచేవారు. రైతులకు ఎప్పటికప్పుడు పంపిణీ చేసేవారు. అప్పట్లో అన్నదాతలతో ఆర్‌బీకేలు కళకళలాడుతూ ఉండేవి. ఇప్పుడు చాలా కేంద్రాలను మూసేశారు. ఉన్న వాటినీ నిర్వీర్యం చేసేశారు. అప్పట్లో ఎరువులు, విత్తనాల గడువు ముగిసిపోతే ప్రభుత్వమే ఆయా కంపెనీలకు వెనక్కు పంపి మళ్లీ కొత్త స్టాకు తెప్పించి అందుబాటులో ఉంచేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఎరువులు లేవు, విత్తనాలు లేవు. ఆర్‌ఎస్‌కేలకు రైతులు వచ్చే అవకాశమే లేకుండా చేసేశారు. పలు చోట్ల ఆర్‌ఎస్‌కే భవనాలను విరిగిపోయిన ఫర్నీచర్, ఇతర సామగ్రిని వేసుకునేందుకు వాడుతున్నారు.
వరదయ్యపాళెం మండలం మత్తేరిమిట్టలో మూసేసిన రైతు సేవా కేంద్రం
పంచాయతీలు
774
అన్నదాతల సంఖ్య
3.5లక్షలు
సేవ..లే!
సేవ..లే!
సేవ..లే!
సేవ..లే!


