స్పా ముసుగులో వ్యభిచారం | - | Sakshi
Sakshi News home page

స్పా ముసుగులో వ్యభిచారం

Sep 15 2024 1:54 AM | Updated on Sep 15 2024 11:51 AM

స్పా ముసుగులో వ్యభిచారం

స్పా ముసుగులో వ్యభిచారం

తిరుపతి క్రైమ్‌: తిరుపతి నగరంలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ముగ్గురు విటులను అరెస్టు చేశారు. ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ వెంకటనారాయణ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లోని మూడు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఆ క్రమంలో ఈస్ట్‌ సీఐ మహేశ్వర రెడ్డి, ఎస్‌ నాగేంద్రబాబు, సిబ్బంది కలసి కొర్లగుంటలోని డీబీఆర్‌ హాస్పిటల్‌ రోడ్లో ఉన్న సీ–7 సెలూన్‌ అండ్‌ స్పా సెంటర్‌పై దాడి చేశారు.

 ఆ సెంటర్‌లో నలుగురు మహిళలు, ముగ్గురు విటులను పక్క పక్క గదుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ముగ్గురు విటులను అరెస్టు చేశారు. ఆ స్పా సెంటర్‌ మేనేజర్‌గా మనీషా, ఆర్గనైజర్లుగా మహి, ఆమె భర్త అఫ్తాబ్‌ వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. మహిళల అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. ఆధ్యాత్మిక నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement