
కలెక్టరేట్‌లో మోడల్ కౌంటింగ్ కేంద్రం
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్‌లో శుక్రవారం మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదిన సా ర్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించను న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు అవగాహన కల్పించేందుకు మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం బాక్స్‌ను ఏలా ఓపెన్ చేయాలి, లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఎలా క్లోజ్ చేయాలి, వీవీ ప్యాట్‌లను ఎలా పరిశీలించాలి, పోస్టల్ బ్యాలెట్ల ను ఎలా లెక్కించాలి అనే అంశాలను తెలియజేయనున్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఎక్కడ కూర్చోవాలి, టేబుళ్లను ఎక్కడ ఏర్పాటు చేయాలి, రౌండ్ల వారీగా ఫలితాలను ఎలా ప్రకటించాలని తదితర అంశాలను మోడల్ కౌంటింగ్ కేందరంలో వివరించనున్నారు.