బెంగళూరు: డీకే శివకుమార్‌తో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల భేటీ

YS Sharmila Met Karnataka Deputy CM Dk Shiva Kumar - Sakshi

బెంగళూరు: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. సోమవారం ఉదయం బెంగళూరు వెళ్లిన ఆమె.. ఆయన నివాసంలోనే మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. 

కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం దిశగా కాంగ్రెస్‌ పార్టీని నడిపించినందుకుగానూ శివకుమార్‌ను పుష్ఫ గుచ్చం ఇచ్చి వైఎస్‌ షర్మిల అభినందించినట్లు సమాచారం. అయితే ఈ భేటీ సారాంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌ను విలీనం చేయాలంటూ సోనియా గాంధీ నుంచి షర్మిలకు ప్రతిపాదన వచ్చిందన్న ఊహాగానాలు ఆ మధ్య వినిపించాయి. అయితే వాటిని ఆమె కొట్టిపారేశారు. 

కర్ణాటకలో తిరుగులేని విజయాన్ని అందించనప్పటికీ డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పీసీసీ చీఫ్‌ పదవిలో కొనసాగడంతోనే సరిపెట్టుకున్నారాయన. ఇక తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితం కావాలంటూ ప్రతిపక్షాలకు షర్మిల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె డీకే శివకుమార్‌తో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ కుంపటిపై హస్తినలో హీట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top