నిరుద్యోగులు చనిపోతుంటే కేసీఆర్‌లో చలనమేదీ?  | YS Sharmila Disposed CM KCR Over Unemployment | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ను నిలదీసిన వైఎస్‌ షర్మిల 

Nov 28 2021 3:52 AM | Updated on Nov 28 2021 3:52 AM

YS Sharmila Disposed CM KCR Over Unemployment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ బిడ్డ కవిత నిజామాబాద్‌ ఎంపీగా ఎన్నికల్లో ఒక్కసారి ఓడితేనే ఆయన గుండె తల్లడిల్లిపోయిందని.. మరి అదే గుండె నిరుద్యోగులు చనిపోతే ఎందుకు చలించట్లేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల నిలదీశారు. శనివారం ఆమె ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌ వైఖరిని ఎండగట్టారు. ఒక్కసారి ఓడిపోయినందుకే బిడ్డకు రెండుసార్లు ఎమ్మెల్సీ పట్టం కట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టేందుకు రెడీగా ఉన్నారని విమర్శించారు.

కానీ నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక ఎంతో మంది నిరుద్యోగులు బలవంతంగా చనువు చాలిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సోయి కేసీఆర్‌కు లేకుండాపోయిందన్నారు. నిరుద్యోగులను బలితీసుకుంటున్న హంతకుడు కేసీఆర్‌ అని షర్మిల దుయ్యబట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement