పాకాల బీచ్‌ ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan on Tragic Loss of Youthful Lives at Pakala Beach | Sakshi
Sakshi News home page

పాకాల బీచ్‌ ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Oct 10 2026 8:52 PM | Updated on Oct 10 2026 9:46 PM

YS Jagan on Tragic Loss of Youthful Lives at Pakala Beach

తాడేపల్లి: పాకాల బీచ్‌ ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. ‘‘గల్లంతైన వారి ఆచూకీ కోసం అవసరమైన సహాయక, గాలింపు చర‍్యలకు వేగవంతం చేయాలి. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ తీరని దుఃఖాన్ని తట‍్టుకునే మనోధైర్యాన్ని బాధిత కుటుంబాలకు భగవంతుడు ‍ప్రసాదించాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

కాగా, ప్రకాశం జిల్లా సింగరాయ కొండ మండలం పాకల బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏడుగురు యువకులు సముద్రంలో స్నానానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు వారిలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. 

ఇదీ చదవండి: అందుకే జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలు: నితిన్‌ నబీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement