ఇదేం పిచ్చి రా బాబోయ్.. మొహాలకు న్యూస్ పేపర్లు చుట్టుకొని.. | Vemulawada: Youth Strange Tricks To Get More Youtube Views - Sakshi
Sakshi News home page

ఇదేం పిచ్చి రా బాబోయ్.. మొహాలకు న్యూస్ పేపర్లు చుట్టుకొని..

Published Sun, Aug 27 2023 8:41 PM

Youth Strange Tricks For Youtube Views In Vemulawada - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: రీల్స్ పిచ్చిలో పడి కొందరు యువకులు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ పట్టణంలో ముగ్గురు యువకులు బైక్‌పై మొహాలు కనబడకుండా న్యూస్ పేపర్లు చుట్టుకొని వేములవాడ వీధుల గుండా పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ తిరగడంతో.. పట్టణ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు.

కొందరు యువకులు వారిని వెంబడించి పట్టుకొని ప్రశ్నించగా తాము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామని, ప్రమోషన్ కోసం వీడియో షూట్ చేశామని తెలిపారు. ఆ మాటలు విన్న పట్టణ వాసులు ఒక్కసారిగా అవాక్కై.. ఒకింత చిరాకు పడ్డారు. ఇదేం పిచ్చి రా బాబోయ్ అంటూ తలలు పట్టుకున్నారు.


చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. 

Advertisement
 
Advertisement