
హైదరాబాద్: రాజస్థాన్ నుంచి ఖైరతాబాద్ మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఆట వస్తువులు విక్రయించేందుకు వచ్చిన మహిళకు బుధవారం ఉదయం ఖైరతాబాద్ మహాగణపతి క్యూలైన్ ప్రాంతంలో పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రి గేటు లోపలికి తీసుకువచ్చారు. అంతలోనే హాస్పిటల్ సిబ్బంది స్ట్రెచర్ సిద్దం చేస్తుండగా ప్రాంగణంలోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బిడ్డతో సహా తల్లిని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు.