ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి..ఇప్పుడేమో! | Woman Protest Infront Of Lover House In Adilabad | Sakshi
Sakshi News home page

ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి..ఇప్పుడేమో!

Aug 10 2021 10:01 AM | Updated on Aug 10 2021 10:05 AM

Woman Protest Infront Of Lover House In Adilabad - Sakshi

నిరసన తెలుపుతున్న చౌదరి మాయ 

సాక్షి, ఆదిలాబాద్‌: పెళ్లి చేసుకుంటానని ప్రేమించి ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. వివరాలు.. మండలంలోని టోంకిని గ్రావనికి చెందిన చౌదరి మాయ (24), సిర్పర్‌(టి) పంచాయతీ పరిధిలోని షేక్‌అహ్మద్‌గూడ కాలనీకి చెందిన దంద్రె తిరుపతి(26) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైన తిరుపతి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని చౌదరి మాయ నిలదీయడంతో యువకుడు నిరాకరించాడు. దీంతో న్యాయం చేయాలని సదరు యువతి ప్రియుడి ఇంటి ఎదుట సోమవారం నిరసనకు దిగింది. యువతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తమ గోడు విన్నవించుకోగా.. కౌటాల సీఐ బుద్దే స్వామి, ఎస్సై రవికువర్‌ స్టేషన్‌లో దంద్రె తిరుపతికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా మహిళా సంఘం సభ్యులు సంఘటన స్థలానికి వచ్చి బాధితురాలికి సంఘీభావం తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement