తెలంగాణ వర్సిటీ అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తాం: వినోద్‌కుమార్‌  | Sakshi
Sakshi News home page

తెలంగాణ వర్సిటీ అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తాం: వినోద్‌కుమార్‌ 

Published Sun, Sep 24 2023 3:13 AM

We will solve the problems of Telangana varsity teachers: Vinodkumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభు­త్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్‌ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌యూటీఏ) 3వ కన్వెన్షన్‌ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ‘తెలంగాణలో ఉన్నత విద్య– సమకాలీన సమస్యలు – సాధ్యమైన చర్యలు‘ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు వినోద్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వర్సిటీ నిర్మాణాల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగించాలని సూచించారు. వివిధ భావజాలాలతో సంబంధం లేకుండా విద్యార్థులను రా­జ­కీయ భాగస్వామ్యానికి దూరంగా ఉంచడంలో కుట్ర దాగుందని, దీని పర్యవసానాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి మాట్లాడు తూ..పెండింగ్‌లో ఉన్న వర్సిటీ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement