వీడియో వైరల్‌: రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. నిలిచిపోయిన రైళ్లు | Vikarabad Young Woman Drives Car On Railway Tracks, Watch Video Inside | Sakshi
Sakshi News home page

వీడియో వైరల్‌: రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. నిలిచిపోయిన రైళ్లు

Jun 26 2025 10:36 AM | Updated on Jun 26 2025 11:36 AM

Vikarabad: Young Woman Drives Car On Railway Tracks

సాక్షి, వికారాబాద్‌: రీల్స్‌ పిచ్చితో రైల్వే ట్రాక్‌పై కారు నడుపుతూ ఓ యువతి హల్‌చల్‌ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడిపి కలకలం సృష్టించింది. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా ఆ యువతి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును అడ్డుకున్నారు. అయితే, వారిని ఆ యువతి చాకుతో బెదిరించినట్లు తెలిసింది. ఆ యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతి నిర్వాకం కారణంగా గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement