టీఆర్‌ఎస్‌ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్‌

Vanama Raghava Suspended From TRS Party - Sakshi

హైదరాబాద్‌: ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాఘవను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమా రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వనమా అరాచకాలను చెబుతూ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని  ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు రామకృష్ణ.

వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే వనమా రాఘవను సస్పెండ్‌ చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top