పార్టీ మారితే డిస్‌క్వాలిఫై చేయ్యాలి: షబ్బీర్‌ అలీ

Uttam Kumar Reddy Over Dubbaka Byelection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్‌లో ఒక్కో రిస్టార్‌లో వంద మంది చొప్పున జడ్పీటీసీలను బంధీ చేశారంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపణలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ తరఫున బరిలో నిలిపే అభ్యర్థి గురించి గాంధీ భవన్‌లో సమావేశమై చర్చించారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఉప  ఎన్నిక అభ్యర్థి ప్రకటన రేపు చేస్తామని తెలిపారు. దీని గురించి పార్టీలో ఇంకా చర్చ జరగుతుందన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయినా విలువలు పాటించిందని ప్రశంసించారు. ఇక టికెట్‌ దక్కుతుందని భావిస్తున్న చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి విషయం గురించి ఉత్తమ్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామ్య విలువలు మరింత పెరుగుతాయి అనుకున్నాము. తెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ లూటీ చేస్తూ.. రాజకీయాన్ని కమర్షియల్ చేసింది. టీఆరెస్ పార్టీ రాజకీయాలను దిగజార్చుతుంది. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కవితను లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బరిలో మళ్ళీ నిలబెట్టారు. నిజామాబాద్‌  జిల్లాలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో ప్రజలు గమనిస్తున్నారు. కరోనా సమయంలో రాజకీయ పార్టీలు సమావేశాలు-భేటీలు పెట్టొద్దన్న టీఆర్‌ఎస్ తాను మాత్రం అన్ని జరిపింది. ప్రజల తీర్పును వ్యతిరేకిస్తూ ఇతర పార్టీ నేతలను డబ్బులు పెట్టి కొంటుంది. ఎన్నికల ఉల్లంఘనకు టీఆర్‌ఎస్ పార్టీ పాల్పడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం టీఆర్‌ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతాం’ అన్నారు ఉత్తమ్‌. (చదవండి: ఒక్కటి కాదు.. ఐదు మంత్రి పదవులు )
 
అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చారని రాములు నాయక్- భూపతి రెడ్డిని డిస్‌క్వాలిపై చేశారు. లోక్ సభలో ఓడిన కవితను మళ్ళీ ఎమ్మెల్సీ బరిలో నిలబెట్టారు. కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు సూటికేసులు చేతులు మారుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కామారెడ్డి-నిజామాబాద్ కలెక్టర్‌కు విజ్ఞపి చేసినా పట్టించుకోవట్లేదు. ఉమ్మడి నిజామాబాద్‌లో ఒక్కో రిసార్ట్‌లో వంద మంది చొప్పున జడ్‌పీటీసీలను బందీ చేశారు. లోకల్ బాడీలో ఏ పార్టీ తరపున ఎన్నికైతే పదవీకాలం అయ్యే వరకు అదే పార్టీలో కొనసాగాలి. పార్టీ మారితే వెంటనే డిస్‌క్వాలిపై చేయాలి అని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top