దుబాయ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు  | Ugadi Festival In Dubai Celebrated In Grand Way | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు 

Apr 4 2022 2:48 AM | Updated on Apr 4 2022 2:48 AM

Ugadi Festival In Dubai Celebrated In Grand Way - Sakshi

ఉత్సవాలకు హాజరైన సినీ నటులు శ్రీకాంత్, ఈషారెబ్బా   

నిజామాబాద్‌ కల్చరల్‌: దుబాయ్‌లో ఉగాది ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి. తెలుగు అసోసియేషన్స్‌ యూఏఈ కల్చరల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో మార్చి 27న తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దుబాయ్‌లోని షేక్‌రషీద్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1,500 మంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు. దుబాయ్, ఒయాసిస్, షార్జా, రస్‌ఆల్‌ఖైమా, అబుదాబి నుంచి వచ్చిన ప్రతిభావంతులైన చిన్నారులు, యువ బృందాలు చేసిన సంప్రదాయ, సినీ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

వేడుకలో పాల్గొన్న సినీ నటుడు శ్రీకాంత్, నటి ఈషారెబ్బను నిర్వాహకులు సన్మానించారు. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్, శుభోదయం గ్రూప్, మలాబార్‌ గో ల్డ్, ఫార్చ్యూన్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్, డాలర్‌ డివైన్‌ క్లబ్, హాక్‌ సెక్యూరిటీ సర్వీసెస్, ఆల్‌కెండీ గ్రూప్, మైదుబాయ్, ఆల్‌మైరా 64 టేస్ట్‌ ఆంధ్ర రెస్టారెంట్, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement