మూడు నెలల్లో ‘ఉదయ సముద్రం’ ఎత్తిపోతల  | Udaya Samudram Project Likely To Start In Three Months Hands Of CM KCR | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లో ‘ఉదయ సముద్రం’ ఎత్తిపోతల 

Nov 9 2022 1:01 AM | Updated on Nov 9 2022 1:01 AM

Udaya Samudram Project Likely To Start In Three Months Hands Of CM KCR - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును మూడు నెలల్లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. మంగళవారం ఆయన నార్కట్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును ప్రారంభించే రోజు లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తామన్నారు.

లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, పెండింగ్‌ బిల్లులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌తో ఉదయ సముద్రంపై చర్చజరిగిందని, తక్షణమే సీఎం స్పందించి అధికారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు. ప్రాజెక్టులో ప్రధానమైన అప్రోచ్‌ కాలువ, సొరంగం, సర్జ్‌పూల్, పంప్‌హౌస్, సబ్‌ స్టేషన్, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement