
ములుగు జిల్లా: తెలంగాణ గ్రూపు 1 ఫలితాల్లో(Group-1 Results) ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక ప్రతిభ కనబర్చి డీఎస్పీగా(DSP) ఎంపికయ్యారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు. తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ తెచ్చుకున్నారు. దీంతో గురువారం మల్లంపల్లిలో ప్రజా సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లంపల్లి (Mallampalli) గ్రామానికి చెందిన సరోజన-సమ్మయ్య దంపతుల కుమార్తె డీఎస్పీ ఉద్యోగం సాధించడం గర్వ కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, చీదర సంతోష్, మొర్రి రాజుయాదవ్, కానుగంటి సతీష్, రవి, సంపత్, అనిల్రెడ్డి, సంతోష్, మధు, వేణు తదితరులు పాల్గొన్నారు.